Tuesday, May 7, 2024

మూడోరోజూ అదే జోరు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో నిన్న భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. నేడు కూడా దానిని కొనసాగించింది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 696 పాయింట్లు లాభపడి 59,558కి చేరుకుంది. నిఫ్టీ 203 పాయింట్లు పెరిగి 17,780 వద్ద స్థిరపడింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి.

ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement