Thursday, May 9, 2024

Secunderabad Club: సికింద్రాబాద్‌ క్లబ్‌ మూసివేత

సికింద్రాబాద్‌ క్లబ్‌ పూర్తిగా మూసివేశారు. సికింద్రాబాద్‌ క్లబ్‌ లో అగ్ని ప్రమాదం నేపథ్యలో యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్‌ మూసివేస్తున్నట్లు పేర్కొంది. నిన్న జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చాలా ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం తెలిపింది. క్లబ్‌ సభ్యులకు సంబంధించిన డేటా సురక్షితంగానే ఉందని వెల్లడించింది. క్లబ్‌ లోని కొల్నాడబార్‌, బిలియర్డ్స్‌ రూం, బాల్‌ రూం, మెయిన్‌ రిసప్షన్‌ నుంచి ఫస్ట్‌ ప్లోర్‌ కు వెళ్లే చెక్క మెట్లు దగ్ధం అయినట్లు వివరించారు. ఈ ప్రమాదంపై వివరాలు తెలిసే వరకు క్లబ్‌ ను మూసి వేస్తున్నట్లు చెప్పారు.

కాగా, 143 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ వారసత్వ భవనం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఫలితంగా కనీసం రూ.25 కోట్ల నష్టం వాటిల్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement