Tuesday, May 7, 2024

ఎస్బీఐని మోసం చేసిన కేసులో ‘ఘ‌న్ శ్యాందాస్ జ్యూవెల‌ర్స్’ అధినేత అరెస్ట్

రుణాల పేరిట ఎస్ బీఐని మోసం చేశార‌న్న కేసులో ఘ‌న్ శ్యాందాస్ జ్యూవెల‌ర్స్ య‌జ‌మాని సంజ‌య్ అగ‌ర్వాల్ ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ అదుపులోకి తీసుకుంది.. 2010- 11లో నకిలీ, ఫోర్జరీ దస్త్రాలతో హైదరాబాద్‌లోని అబిడ్స్ ఎస్‌బీఐలో సంజయ్‌ రూ.67 కోట్ల రుణం తీసుకున్నాడు. ఈ రుణంతో అక్రమంగా బంగారం కొనుగోలు చేసి మార్కెట్‌లో విక్రయించినట్లు అతడిపై అభియోగం నమోదైంది. బంగారం విక్రయించగా వచ్చిన డబ్బును భార్య, సోదరులు, ఉద్యోగుల పేరిట డొల్ల కంపెనీలకు సంజయ్‌ బదిలీ చేశాడు. సంజయ్‌ సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన ఎస్‌బీఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుంకం లేకుండా బంగారాన్ని దిగుమతి చేసి విక్రయించిన కేసులో సంజయ్‌ను ఇప్పటికే కోల్‌కతా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. జైల్లో ఉన్న అతడిని పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సంజయ్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement