Sunday, April 28, 2024

సలేశ్వరం జాతర రద్దు..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సలేశ్వరం జాతరను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా అటవీశాఖ అధికారి జి. కిష్టాగౌడ్ ప్రకటన విడుదల చేశారు. అడవుల్లో గిరిజన ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు ఎవరు సలేశ్వరం జాతర రావద్దని కోరారు. ఈ నెల 26 నుంచి 27 వరకు సలేశ్వరం జాతర జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతుండడంతో సలేశ్వరం జాతరను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని అటవీ శాఖ కోరింది.

నాగర్ కర్నూలు జిల్లాలో… దట్టమైన నల్లమల అడవుల్లో ఉంది సలేశ్వరం లింగమయ్య స్వామి ఆలయం. సలేశ్వరం శ్రీశైలంలోని ఒక యత్రా స్థలం. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన, చారిత్రిక, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలోని ఒక ఆదిమవాసి యత్రస్థలం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తొలి పౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అంతేకాదు శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు. ఎన్ని ఇబ్బందులు పడుతూ ఆలయానికి వెళ్తే… అక్కడికి వెళ్లగానే అన్ని కష్టాలూ మర్చిపోయి… భక్తి పారవశ్యంలో మునిగిపోతారు భక్తులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement