Friday, March 29, 2024

అల్లుఅర్జున్ DJ సరికొత్త రికార్డ్

హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించింది. కాగా ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ఇప్పటికే వందలాది మిలియన్ ల వ్యూస్ అందుకుంది. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా డబ్బింగ్ వెర్షన్ లో వందల కోట్ల వ్యూస్ ను సాధించాయి.

ఇక తాజాగా తెలుగులో కూడా ఈ చిత్రం ఒకే ఛానల్ 100 మిలియన్ వ్యూస్ అందుకుంది. తెలుగులో డైరెక్ట్ గా 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సినిమాలు చాలా తక్కువ. గతంలో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఆ స్థాయిలో నిలిచింది. ఇప్పుడు డీజే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన రష్మీక మందన్న నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement