Wednesday, May 1, 2024

War: ఉక్రెయిన్​లో భయం భయం.. ఎంబసీ ఆఫీసుకు తరలివస్తున్న భారతీయులు..

ఉక్రెయిన్‌పై రష్యా వార్​ చేస్తుండడంతో ఆ దేశంలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జనాలు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలియక క్షణ క్షణం భయాందోళన చెందుతున్నారు. కాగా, ఉక్రెయిన్​లో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు గురువారం ఉదయం కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం వద్దకు చేరుకున్నారు. స్వదేశానికి పంపించాలని రాయభార కార్యాలయం అధికారులను వేడుకుంటున్నారు.  కాగా, ఎంబసీ ప్రాంగణంలో అందరికీ వసతి సరిపోలేదు. దీంతో రాయబార కార్యాలయం సమీపంలో సురక్షిత ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను అక్కడికి తరలించింది. ప్రస్తుతం ఎంబసీ వెలుపల భారతీయులెవరూ లేరని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌లోని విద్యార్థులతో సహా భారతీయ పౌరులకు సహాయం చేయడంలో రాయబార కార్యాలయం తగు చర్యలు తీసుకున్నట్టు సమాచారం..

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా తయారైన నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం తాజా హెచ్చరిక జారీ చేసింది. “దయచేసి మీరు ఉన్న ఇంటి దగ్గర నుంచి బయటికి రావద్దు. సురక్షితంగా ఉండండి, అవసరమైతే తప్ప మీ ఇళ్లను విడిచిపెట్టవద్దు. ఎల్లప్పుడూ మీతో ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లండి.. అని రాయభార కార్యాలయం అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో ఎయిర్ సైరన్లు, బాంబుల దాడులకు సంబంధించిన శబ్ధాలు వినబడుతున్నాయని.. కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం గూగుల్ మ్యాప్‌లలో సమీపంలోని బాంబు షెల్టర్‌ల ప్లేసులను చూడాలని పౌరులకు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement