Wednesday, November 30, 2022

15నిమిషాల పాత్ర‌కి .. రూ.5కోట్ల పారితోషికం..

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి దేశ‌వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించారు. తాజాగా ఆయ‌న తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇద్ద‌రు స్టార్ హీరోస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తెర‌పై సంద‌డి చేయ‌నున్నారు. కాగా ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా ఆలియాభ‌ట్ న‌టిస్తుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర కేవ‌లం 15నిమిషాలే ఉంటుంద‌ట‌. అయితే ఈ పాత్ర‌కి ఆలియా ఐదు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు టాక్.

ప‌దిరోజుల షూటింగ్ కి ఆమె ఇంత ఆఫ‌ర్ చేసింద‌ట‌. అంటే రోజుకి రూ.. 50 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్టు. ఇది చాలా ఎక్కువ రెమ్యున‌రేష‌నే అని చెప్పాలి. నిర్మాత‌లు భేర‌సారాలు ఆడినా ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో చివ‌ర‌కు చేసేదేం లేక ఆమె అడిగినంత ఇచ్చార‌ట‌. ఆమె ఉంటేనే బాలీవుడ్‌లో సినిమాకు మార్కెట్ ఉంటుంద‌ని రాజ‌మౌళి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆమెను తీసుకున్నాడు. తాను ముందే చెప్పిన‌ట్టు ప‌ది రోజుల‌కు మించి ఒక్క కాల్షీట్ కూడా ఇవ్వ‌న‌ని చెప్పేసింద‌ట‌. డిమాండ్ అలా ఉంది మ‌రి ఏం చేస్తాం..

Advertisement

తాజా వార్తలు

Advertisement