Friday, May 10, 2024

కొత్త జిల్లాల‌ ఏర్పాట్ల‌పై ప్ర‌భుత్వ క‌స‌ర‌త్తు..

ప్ర‌భ‌న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లి తెరపైకి వచ్చింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత ఉన్నతాధి కారులకు సూచించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్‌ సభ్యులతో జరిగిన సమావేశంలో కొత్త జిల్లాల అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. జనగణన పూర్తయ్యేలోగా విభజనకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసి నోటిఫికేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను సిద్దం చేయాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.

కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న జనగణన ప్రక్రియ పూర్తికాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని సమావేశంలో కొంతమంది అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈలోపు అందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు, పలు జిల్లాల్లో చేపట్టాల్సిన ప్రజా అభిప్రాయం తదితర అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన చట్టంలోను ఈ అంశం పొందుపరిచిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వైపు ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా పార్లమెంట్‌ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement