Tuesday, May 7, 2024

‘ఓటీటీ’లో ఆర్ ఆర్ ఆర్ – ఎప్పుడో తెలుసా !

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్ల మోత మోగించింది. పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. థియేటర్లలో సినిమా నడుస్తుండగానే చాలా మంది అభిమానులు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. నిజానికి సినిమాను విడుదలైన మూడు నెలలకు గానీ ఓటీటీలోకి తీసుకురాబోమని దర్శక దిగ్గజం రాజమౌళి ఇంతకుముందే చెప్పకనే చెప్పారు. దీంతో జూన్ తర్వాతే సినిమా ఓటీటీలోకి వస్తుందని నెట్టింట్లో వార్త చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లకు సంబంధించి ‘జీ5’ ఓటీటీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు స‌మాచారం. హిందీ వెర్షన్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని అంటున్నారు. మరి, ఆర్ఆర్ఆర్ ను బుల్లితెరపై చూడాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement