Friday, April 26, 2024

నో కెమెరా , నో యాక్ష‌న్ – ఓన్లీ ఫోన్ – ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్

మ‌హాశివ‌రాత్రి నేప‌థ్యంలో అదిరిపోయే పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్. ఈ పోస్ట‌ర్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌లో వైపు ప‌డుకుని ఉన్నారు. వారిద్ద‌రి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ఫోన్ల‌తో బిజీగా ఉన్న‌ట్లు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేయ‌నున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అలాగే.. యంగ్ టైగ్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీగా అంచ‌నాలు పెరిగి పోయాయి. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి, నటులు ఆలియాభట్ ,అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement