Monday, April 29, 2024

‘ఆర్ ఆర్ ఆర్’ తొలివారం క‌లెక్ష‌న్స్ – ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.710కోట్లు

మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషించారు. ఈ భారీ చిత్రం తొలివారం ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదే సమయంలో రూ.392.45 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ.60.55 కోట్లు వసూలైతే ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ కు వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మొదటివారం దేశవ్యాప్తంగా రూ.560 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి-2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను మాత్రం దాటలేకపోయింది. బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా తొలివారం రూ.860 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమాకు బెంచ్ మార్క్ సెట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement