Thursday, May 2, 2024

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం వేగ‌వంత‌మైన చ‌ర్య‌లు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ లేటెస్ట్ వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. అయితే బాధితులు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని, హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే సరిపోతుందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

కాగా, తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటింటి జ్వ‌ర స‌ర్వే చేప‌ట్టి బాధితుల‌ను గుర్తిస్తోంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్క‌డిక‌క్క‌డే మెడిసిన్స్ అందిస్తోంది. దాదాపు కోటి మెడిక‌ల్ కిట్స్ ఉన్న‌ట్టు మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ఫీవ‌ర్ స‌ర్వేతో ముందే ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని గుర్తించి వారిని హోం ఐసొలేష‌న్‌లో ఉండేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో క‌రోనా వ్యాప్తి త‌గ్గ‌డానికి ఆస్కారం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement