Saturday, April 20, 2024

అర్ధ‌రాత్రి ఘోర‌ప్ర‌మాదం.. రెడీమిక్స్ లారీ బీభ‌త్సం..

హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ రెడీమిక్స్ లారీ బీభ‌త్సం సృష్టించింది. సికింద్రాబాద్ మెట్టుగూడ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రోడ్డు మార్గంలో కాంక్రీట్ రెడీ మిక్స్ లారీ మెట్రో పిల్లర్ కు ఢీ కొట్టి బోల్తాప‌డింది.

కాగా, ఈ యాక్సిడెంట్‌ని అదే రూట్‌లో వ‌స్తున్న‌ చిలకలగూడ పెట్రోలింగ్ పోలీసులు చూడడంతో పెను ప్ర‌మాద‌మే త‌ప్పింద‌ని చెప్ప‌వ‌చ్చు. అంతేకాకుండా స్థానిక మెట్టుగూడ కార్పొరేటర్ అదే సమయంలో స్పందించి 2 గంటలు శ్రమించి రెడీ మిక్స్ లారీలో నుంచి లారీ డ్రైవర్ ను ప్రాణాల‌తో కాపాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement