Sunday, April 28, 2024

Big Breaking | రిటైర్డ్​ ఎంపీడీవో మర్డర్​ మిస్టరీ వీడింది.. సుపారీ గ్యాంగ్​ అరెస్టు

జనగామ జిల్లాలో భూ మాఫియా చేసిన దారుణం బయటపడింది. ఓ భూమి వివాదం విషయంలో పూర్తి ఆధారాల కోసం రైట్​ ఇన్​ఫర్మేషన్​ యాక్ట్​ (ఆర్​టీఐ) కింద దరఖాస్తు చేశాడన్న కారణంగా రిటైర్డ్​ ఎంపీడీవో రామకృష్ణయ్య మర్డర్​కి స్కెచ్​ వేశారు. కాగా, అతడిని తొలుత కిడ్నాప్​ చేసి, మర్డర్​ చేసిన సుపారీ గ్యాంగ్​ని పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్​లో నలుగురు ఉన్నారని, అందులో ముగ్గురు నిందితులను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరి కోసం సెర్చ్​ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా, ఈ మర్డర్​కు సుపారీ ఇచ్చిన అంజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. 8 లక్షల రూపాయలకు సుపారి మాట్లాడి, 50 వేల రూపాయలు అడ్వాన్స్​గా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. హత్యకు భూ వివాదమే కారణమని వరంగల్​ పోలీస్​ కమిషనర్​ ఏవీ రంగనాథ్​ మీడియాకు వెల్లడించారు.

ఆ బడా నాయకుడే భూ మాఫియా లీడరా?

రామకృష్ణయ్య మర్డర్​ వెనకాల భూ రాబంధుల హస్తం ఉందని, దీనికి ఓ పార్టీకి చెందిన బడా లీడరే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ జిల్లాలో భూ మాఫియాను ఆ బడా లీడరే నడిపిస్తున్నాడని, పోలీసులు విచారణ జరిపి అసలు క్రిమినల్​ని పట్టుకోవాలని స్థానికులు, రామకృష్ణయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే.. ఆ బడా లీడర్​ ఎవరన్నది ఇప్పుడు వరంగల్​ జిల్లాతోపాటు యావత్​ తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement