Sunday, April 28, 2024

‘ఆదిపురుష్’ పై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఆ డైలాగుల‌ను మారుస్తామ‌న్న మూవీ టీమ్‌

థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యి.. భారీ ఓపెనింగ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న డార్లింగ్ ప్రభాస్ తాజా సినిమా ఆదిపురుషపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. అయితే ఈ జానర్‌కు అనుచితంగా అనిపించిన సన్నివేశాలు, క్యారెక్టర్ స్కెచ్‌లను విమర్శించే వారు పెద్ద సంఖ్య‌లోనే ఉన్నారు. అంతే కాకుండా, చాలా మంది ప్రేక్షకులు కొన్ని సన్నివేశాల్లోని డైలాగ్స్‌తో సంతృప్తి చెందలేదని, పౌరాణిక పాత్రలకు ఇలాంటి సాధారణ డైలాగ్‌లు ఎలా వేస్తారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రేక్షకుల సూచనల మేరకు సినిమాలోని కొన్ని డైలాగ్స్‌లో మార్పులు చేయాలని ఆదిపురుష్ టీమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సినిమాలోని కొన్ని డైలాగులకు సంబంధించి చాలా మంది మార్పులు సూచించారు. వారి సూచనలను పరిశీలిస్తున్నామని, ఆ సన్నివేశాల్లోని డైలాగ్‌లను మారుస్తామని ఆదిపురుష్ టీమ్ ఇవ్వాల (ఆదివారం) ప్రకటించింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో ఆదిపురుష్ సినిమాని ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించవచ్చు. ప్రేక్షకుల మనోభావాలను, వారి సూచనలను తాము గౌర‌విస్తామ‌ని చిత్ర నిర్మాతలు తెలిపారు. మరి ఆదిపురుష్ టీమ్ చేసిన ఈ మార్పుల‌ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement