Sunday, April 28, 2024

సినిమా కెరీర్ కి ద‌ళ‌ప‌తి పుల్ స్టాప్.. విజ‌య్ డెసిష‌న్‌కి కార‌ణం అదేనా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో “లియో” సినిమా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా తర్వాత దర్శకుడు వెంకట్ ప్రభుతో మ‌రో ప్రాజెక్ట్ రెడీగా ఉంద‌ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఊహించని విధంగా.. విజయ్ ఇప్పుడు తన కెరీర్ లో లాస్ట్ సినిమాకి చేరుకున్నారన్న‌ టాక్ వైరల్ గా మారింది.

- Advertisement -

వెంకట్ ప్రభుతో సినిమా త‌ర్వాత‌ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు విజయ్ సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది. ఇక‌.. దీనికి తాను ముంద‌స్తు స‌న్నాహాలు కూడా చేసుకున్న‌ట్టు స‌మాచారం. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం త్వరలోనే ఉంటుందన్న విష‌యం కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారంలో ఉంది. మరి తన పొలిటిక‌ల్‌ ఎంట్రీతో తమిళనాడులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయోన‌ని చాలామంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గానే పాలిటిక్స్ పరంగా విజయ్ చేసిన పలు కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement