Thursday, May 9, 2024

ఉమ్మడి రాజధానికి వైద్యానికి వెళ్లే హక్కు లేదా?

ఏపీ నుంచి తెలంగాణ వెళ్లేవారికి సరిహద్దులో తెలంగాణ పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా రామాపురం(కోదాడ), నల్లగొండ జిల్లా పొందుగుల(వాడపల్లి), నాగార్జున సాగర్(మాచర్ల వైపు)మూడు చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. తెలంగాణలోని ఆసుపత్రుల్లో రెఫరెన్స్ లెటర్, బెడ్ కన్ఫర్మ్ ఉంటేనే కోవిడ్ పేషేంట్స్‌లకు తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నా

ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులపై ఆంక్షలు అమలు చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే అంబులెన్స్ లను రానీయకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం వరికీ తెలియదు. దీంతో ఏపీ నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం నాడంతా రోగులు సరిహద్దుల వద్ద ఆగిపోయాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సరిహద్దులో అనుమతి లేని వాహనాలను తెలంగాణ పోలీసులు వెనక్కు పంపించారు. దీనిపై ఏపీ టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు వైద్యానికి వెళ్ళే హక్కు తెలుగువారికి లేదా? అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌ ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా ఉందని, అక్కడికి వైద్యం కోసం వెళ్ళేవారిని తెలంగాణ సరిహద్దుల వద్ద నిలుపు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు బిడ్డలకు తెలంగాణలో వైద్యం చేయించుకొనే హక్కు లేదనడం దుర్మార్గం అని అన్నారు. చెన్నై, బెంగుళూరు వెళ్ళడానికి అక్కడి ప్రభుత్వాలు అడ్డుచెప్పడం లేదని గుర్తు చేశారు.

2024 వరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కనీసం అంబులెన్సులను అడ్డుకోవద్దని కోరారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చించి భేషజాలకు పోకుండా, ప్రజల ప్రాణాలకు ముప్పు రాకుండా చర్యలు తీసుకోవాలని బుచ్చయ్య విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు ట్వీట్

Advertisement

తాజా వార్తలు

Advertisement