Friday, May 3, 2024

మలేషియాలో జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌

కరోనా థర్డ్‌ వేవ్‌తో భారీగా పాజిటివ్‌గా కేసులు పెరుగుతుండడంతో మలేషియా ప్రభుత్వం అప్రమత్తమయింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. ఈ నెల 12 నుంచి ప్రారంభమై.. జూన్‌ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ఆ దేశ ప్రధాని ముహ్యుద్దీన్‌ యాసిన్‌ ప్రకటించారు. మలేషియా కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొంటోందని, ఇది జాతీయ సంక్షోభాన్ని రేకెత్తిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా పాజిటివ్‌ కేసులు వస్తున్నందున.. ప్రజారోగ్య వ్యవస్థపై భారం పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ అత్యవసరమన్నారు.

సామాజిక సమావేశాలతో పాటు అంతర్‌రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలన్నీ నిషేధిస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థలు మూసివేబడుతాయని.. అయితే, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రంజాన్‌ సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో ప్రార్థనల రోజు ముస్లింలు ఇండ్లకే పరిమితం కానున్నారు. సోమవారం 3,807 పాజిటివ్‌ కేసులు రికార్డవగా.. మొత్తం కేసులు 4,44,284కు పెరిగాయి. మొత్తం 1700 మంది వరకు మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement