Saturday, December 7, 2024

టెకీలు, స్టూడెంట్స్ కి రిలీఫ్‌.. వీసా, ఇంటర్వ్యూలు రద్దుచేసిన అమెరికా..

వీసా జారీ చేసే విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వీసా జారీ ప్రక్రియలో చాలా మార్పులు చేసింది. హెచ్‌1బీ సహా 12 రకాల వీసాలకు వ్యక్తిగత ఇంటర్యూలు రద్దు చేసింది. వీసా వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించేందుకు ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. తాత్కాలిక ప్రాతిపదికన వీటిని అమలు చేస్తామని తెలిపింది. హెచ్‌ 1బీ సహా మొత్తం 12 రకాల వీసాల జారీల కోసం తాత్కాలికంగా ఇంటర్యూ విధానాన్ని రద్దు చేసింది. కొత్త ఏడాదిలో భారత్‌ నుంచి యూఎస్‌ వెళ్లాలనుకునే టెకీలు.. విద్యార్థులకు ఇది ఒకరకంగా రిలీఫ్‌ అని చెప్పవచ్చు. బైడెస్‌ సర్కార్‌.. పాత పద్ధతిలో హెచ్‌1బీ వీసాలు జారీ చేయనుంది. ప్రస్తుతం ఉన్న ఆంక్షలు తొలగిస్తూ.. 2022 నుంచి వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ.. లాటరీ విధానంలోనే.. హెచ్‌1బీ వీసాలు మంజూరు చేయనున్నారు.

ఏటా 85వేల వీసాలు జారీ
అమెరికా ప్రతీ ఏట 85వేల హెచ్‌1బీ వీసాలు జారీ చేస్తోంది. నిర్ణీత కోటాలో 65వేల మంది, అలాగే అక్కడ ఉన్నత చదువులు చదువుకునే వారికి అదనంగా మరో 20వేల వీసాలు అందిస్తోంది. టెక్‌ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటాకు మించి హెచ్‌ 1బీ వీసా దరఖాస్తులు సమర్పిస్తే.. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలు కేటాయించేవారు. ట్రంప్‌ తీసుకొచ్చిన ఈ విధానంతో ఎన్నారైల నుంచి అలాగే టెక్‌ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు ఎన్‌ఆర్‌ఐలు కోర్టును ఆశ్రయించారు.

2022 ఆర్థిక సంవత్సరానికి అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు ట్రంప్‌ ప్రవేశపెట్టిన వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని బైడెన్‌ సర్కార్‌ నిర్ణయించింది. కరోనాతో పాటు వివిధ కారణాలతో.. హెచ్‌1బీ వీసాలతో పాటు ఇతర వీసాల మంజూరు ఆలస్యం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement