Saturday, April 27, 2024

Spl Story | ఆ ప్రమాదానికి 35 ఏండ్లు.. సుడిగాలి కారణంగా పట్టాలు తప్పిన ఎక్స్​ప్రెస్​

అది 1988వ సంవత్సరం, జులై8వ తేదీ.. వచ్చే నెలనాటికి ఈ ఇన్సిడెంట్​ జరిగి సరిగ్గా 35 ఏండ్లు అవుతుంది. అయితే.. ఈ ఘటనపై చాలా అపోహలున్నాయి. దీనిపై ఎంక్వైరీ కమిషన్​ కూడా విచిత్రమైన నివేదికలను అందించింది. ఆ రైలు పట్టాలు తప్పడానికి సుడిగాలి కారణమని రిపోర్ట్​లో తెలిపింది. 105 మందిని పొట్టపెట్టుకున్న ఈ మిస్టరీ యాక్సిడెంట్​ని.. ఒడిశా రైళ్ల ప్రమాదంతో చాలామంది యాది చేసుకుంటున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కేరళ రాష్ట్రంలోని అష్టముడి సరస్సులో ఓ ఎక్స్​ప్రెస్​ రైలు పడిపోయింది. దీన్ని పెరుమాన్​ దుర్ఘటనగా రైల్వే వర్గాలు చెబుతుంటాయి. కేరళలో అత్యంత దారుణమైన రైలు దుర్ఘటన ఇది.. 35 ఏళ్ల క్రితం జరిగిన పెరుమాన్ ఇన్సిడెంట్​ని ఇప్పుడు ఒడిశా రైళ్ల ప్రమాదంతో యాది చేసుకుంటున్నారు.

అది 1988, జూలై 8వ తేదీ.. కొల్లాంలోని అష్టముడి సరస్సులో ఐలాండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 105 మంది ప్రయాణికులు చనిపోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ‘‘సుడిగాలి”కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. పట్టాలు తప్పడానికి సుడిగాలి కారణం అని.. కమిషన్​ నివేదిక ఇవ్వడాన్ని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శించారు.

- Advertisement -

ఇక.. రైలు కొల్లాం స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రైలు బెంగళూరు నుంచి తిరువనంతపురం సెంట్రల్‌కు వెళ్తోంది. ఇంజిన్, సెకండ్​ క్లాస్​ కంపార్ట్ మెంట్ అష్టముడి వంతెనను దాటేశాయి.. అయితే.. మిగిలిన కంపార్ట్ మెంట్లన్నీ అష్టముడి సరస్సులో పడిపోయాయి.

దీనిపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్​ ప్రకారం..ఈ ప్రమాదానికి సుడిగాలి కారణం అని తేలింది. ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరో అధ్యయనం చేపట్టారు. దీంతో ట్రాక్ అమరిక, చక్రాల సమస్యలను ఉదహరిస్తూ మరొక విచారణ కమిషన్‌ను నివేదిక ఇచ్చింది. ఆ సమయంలో 14 కోచ్‌లలో 10 బోగీలు పట్టాలు తప్పి, అష్టముడి సరస్సులో పడిపోయాయి. నీళ్లలోపడి 105 మంది జలసమాధి అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement