Thursday, April 25, 2024

Big Breaking: మరోసారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి రెపో రేటు పెంచింది. ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష జరిగింది. 6.25 శాతం నుంచి 6.50 శాతానికి రెపో రేటు పెరిగింది. 25 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ పెంచింది. రెపో రేటును మరోసారి అధికం చేసింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు (0.25శాతం) పెంచింది. దీంతో రెపో రేటు 6.50 శాతానికి చేరింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రకటించారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (25 bps – 0.25%) పెంచుతున్నామని చెప్పారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. గతేడాది మే నుంచి ఆర్బీఐ విడతల తారీగా 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును పెంచింది. అంటే 2.5 శాతం వడ్డీ రేటు అధికమై ప్రస్తుతం 6.50 శాతానికి చేరింది. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు శక్తికాంత దాస్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement