Friday, April 26, 2024

బీర్ తాగిన ఎలుక‌-పిల్లిపై ఫైట్

మందు తాగితే మ‌నుషుల‌కే కాదు జంతువుల‌కి కిక్కు ఇస్తుంద‌ని నిరూపించింది ఓ ఎలుక‌.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ ఇంట్లో గ్లాస్‌లో బీర్ పోసి ఉంటుంది.ఓ ఎలుక మెల్లగా గ్లాసు దగ్గరికి వచ్చి బీరుని గ‌ట గ‌టా తాగింది. కొంత సమయం తర్వాత ఆ ఎలుక ‘బాహుబలి’గా మారి పిల్లిపై దాడి చేస్తుంది. ఎలుక దాడిని తట్టుకోలేక పిల్లి దాని నుంచి దూరంగా పారిపోతుంది. ఎలుకకు సంబందించిన ఫన్నీ వీడియోను ’18plusguyy’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. బాహుబలి ఎలుకకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొద్దిసేపటి క్రితమే అప్‌లోడ్ చేసినా.. 27 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరోవైపు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement