Thursday, May 16, 2024

ల‌గ్జ‌రీ కారు కొన్న – మెగా కోడ‌లు ఉపాస‌న‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాస‌న రీసెంట్ గా కొత్త కారు కొన్నారు. ఆడి ఈ ట్రాన్ అనే కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన ఉపాసన కారు ఫీచర్స్ ను గురించి వివరంగా చెప్పారు. ఈ కారు ఎంతో సురక్షితమని చెప్పారు. తన దృష్టిలో భవిష్యత్తు అంటే సుస్థిరతతో పాటు లగ్జరీ కూడా కలిసి ఉంటుందన్నారు. అంతే కాదు ఆడి ఇ-ట్రాన్‌ కారులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు.స్థిరమైన, విలాసవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదే ఆరంభం అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆడి కారు రేటు ఎంత ఉంటుందో తెలుసా.. కళ్లు చెదిరే ఫీచర్స్ ఉన్న ఈ కారు ధర కోటి ఇరవై లక్షల వరకు ఉంటుందట‌. ఉపాసన తీసుకున్న కారు చాలా బాగుందని, కలర్ అయితే సూపర్ అంటూ..సోషల్ మీడియాలో నెటిజన్లు ఉపాసనను విష్ చేస్తున్నారు. ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇక అపోలో చైర్మెన్ గా ఉన్న ఉపాసన.. మెగా కోడలిగా కొణిదెల వారింట అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉపాసన సోషల్ సర్వీస్ తో పాటు.. మూగజీవాల పరిరక్షణలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతే కాదు ఏదైనా ముఖం మీదై సూటిగా చెప్పే మెగా కోడలు.. సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా మాట్లాడిన నెటిజ్లకు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తుంటారు. ఫ్యాషన్ ఈవెంట్స్ కు వెళ్తూ.. ఆడవారిలో చైతన్య కలిగించే కార్యకరమాలు కూడా చేస్తున్నారు ఉపాసన. అలాగే బీ పాజిటివ్ అనే మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. సోషల్ మీడియా వేదికగా పలు ఆరోగ్య సంబంధిత సూచనలు ఇస్తుంటారు. ఇక రామ్ చరణ్ తో టూర్స్ ప్లాన్ చేసుకుంటూ.. ఆ విశేషాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు మెగా కోడలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement