Friday, May 3, 2024

Rains: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎడగాల్పులతో ప్రజల అల్లాడుతున్నారు. అయితే, వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలుగురాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఏపీలో కూడా అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement