Tuesday, April 30, 2024

రాహుల్ తెలంగాణ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు.. రెండ్రోజులూ ఇక్క‌డే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర‌ పర్యటన దృష్ట్యా టీపీసీసీ ముమ్మర చర్యలను చేపట్టింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మానిక్యం ఠాగూర్‌ కూడా మూడు రోజులు ఇక్కడనే మకాం వేసి.. టూర్‌కు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నాయకులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. రాహుల్‌గాంధీ కార్యక్రమాల ఇన్‌చార్జి బైజు కూడా హైదరాబాద్‌కు వచ్చారు. వారం రోజులుగా వరంగల్‌, హైదరాబాద్‌లో ప్రోటోకాల్‌ అధికారుల పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటనకు సంబంధించి టీ పీసీసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఏయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌ సభకు వెళ్లనున్నారు.

వరంగల్‌లో జరిగే ‘ రైతు సంఘర్షన సభ ‘ జరిగే ప్రాంగణంలో రెండు వేదికలను కాంగ్రెస్‌ నేతలు సిద్ధం చేయనున్నారు. ఒక వేదికలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేతలు, మరొక వేదికలో అప్పుల బాధలు, వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల సభ్యులు కూర్చొనున్నారు. రాహుల్‌గాంధీ ముందుగా రైతు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల సభ్యులతో మాట్లాడి, వారి నుంచి సమస్యలు తెలుసుకోనున్నారు. ఆ తర్వాత సభలో రాత్రి 7 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ నేతల ప్రసంగాలు ఉండగా.. 7 గంటల నుంచి రాహుల్‌ ప్రసంగం ప్రారంభం కానుంది. సభ తర్వాత రాహుల్‌గాంధీ రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు చేరుకుని దుర్గం చెరువు పక్కన ఉన్న కోహినూర్‌ హోటల్‌లో బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement