Saturday, May 11, 2024

Rahul: మణిపూర్ లో రాహుల్ గాంధీ పర్యటన

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌ పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన రాహుల్‌ కాసేపట్లో ఇంఫాల్‌కు చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో బాధితులతో పాటు రిలీఫ్‌ క్యాంప్‌లను పరిశీలిస్తారు. అక్కడి పౌర సమాజ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇంఫాల్ చేరుకోనున్న రాహుల్ గాంధీ అక్కడ నుంచి చురాచంద్‌పూర్‌కు వెళ్తారు. అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్న స్థానికులను పరామర్శిస్తారు. చురాచంద్‌పూర్ నుంచి మోయిరాంగ్‌ ప్రాంతంలో బాధితులను పరామర్శించి.. పౌర సమాజ ప్రతినిధులతో సమావేశం అవుతారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement