Monday, May 6, 2024

ఉక్రెయిన్ కి భారీ మొత్తంలో – ఆయుధాలు పంపిన స్పెయిన్ క్వీన్

ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి స్పెయిన్ క్వీన్ ఏకంగా గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంచర్లు, ఇతర ఆయుధాలను భారీ మొత్తంలో ఆ దేశానికి షిప్‌మెంట్ చేసింది. ఉక్రెయిన్ తాజాగా, స్పెయిన్ నుంచి వచ్చిన ఆయుధాల షిప్‌మెంట్‌ను స్వీకరించిందని వైస్‌గ్రాడ్ అనే మీడియా సంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఆ షిప్‌మెంట్‌లో స్పెయిన్ రాణి స్వదస్తూరితో రాసిన ఐ విష్ యూ విక్టరీ అనే సందేశాన్ని రాసి ఉంచారు. విత్ లవ్ లెటీషియా అనే లైన్ కూడా ఆ పోస్టు కార్డుపై రాశారు. తొలుత ఈ షిప్‌మెంట్ రాగానే స్థానిక సిబ్బంది కొంత తికమకపడ్డట్టు తెలిసింది. కానీ, ఆ పోస్టు కార్డు చూసి స్పెయిన్ రాణి పంపిన షిప్‌మెంట్‌గా గుర్తించారు.
ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా మార్గాలను ధ్వంసం చేసే ఎత్తును రష్యా బలగాలు వేశాయి. ఇందులో భాగంగా రైల్వేకు ఇంధనం సమకూర్చే ఆరు ఫెసిలిటీలను పేల్చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తద్వార ఈ రైల్వే నెట్‌వర్క్ ద్వారా ఆయుధాలను దొన్‌బాస్ రీజియన్‌కు సరఫరా చేపట్టడం ఉక్రెయిన్‌కు కష్టతరంగా మారింది. అంతేకాదు, ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్‌ ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా రైల్వే నెట్‌వర్క్ మొత్తాన్ని నాశనం చేయాలని రష్యా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ క్వీన్ గిఫ్ట్‌గా వెపన్స్ షిప్‌మెంట్ పంపడం ఉక్రెయిన్‌కు ఎంతో కలిసి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement