Sunday, April 28, 2024

పుష్ప‌2లో – బాలీవుడ్ సీనియ‌ర్ హీరో

పుష్ప‌2లో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సునీల్ శెట్టి న‌టించ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రంలో విల‌న్ అయిన ఫ‌హ‌ద్ ఫాజిల్ కి పై అధికారిగా, ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా సునీల్ శెట్టి ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నార‌ట‌. పాత్ర నిడివి కూడా చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే పుష్ప - ద రూల్లో సునీల్ శెట్టి ఎంట్రీపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే, 1992లో విడుద‌లైన హిందీ చిత్రం బ‌ల‌వాన్తో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సునీల్ శెట్టి.. ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించాడు. తెలుగులో ఇదివ‌ర‌కు మోస‌గాళ్ళు (2021), గ‌ని (2022) చిత్రాల్లో క‌నిపించాడు సునీల్ శెట్టి. మ‌రి ఇదే నిజ‌మైతే బాలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి హైప్ రావ‌డం ఖాయం. హీరోగా అల్లు అర్జున్..ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement