Wednesday, May 8, 2024

పుష్ప టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పిన ‘మెగాస్టార్ చిరంజీవి’

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ కి ట్విట్టర్ ద్వారా చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. “సుకుమార్ .. అల్లు అర్జున్ .. రష్మిక మీరంతా కూడా ఈ సినిమా కోసం స్వేదం .. రక్తం చిందించారు. ఎంతో హార్ట్ ఫుల్ గా పనిచేశారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలంగా విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. సునీల్ .. అనసూయ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. సమంత ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. ఈ చిత్రం రేపు డిసెంబ‌ర్ 17న రిలీజ్ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement