Friday, May 3, 2024

పంజాబ్ ఎల‌క్ష‌న్స్‌.. ఫ‌స్ట్‌, సెకండ్ లిస్టులు రిలీజ్‌.. 30 మంది అభ్యర్థులను ప్ర‌క‌టించిన కేజ్రీవాల్..

చండీఘర్‌ : పంజాబ్‌ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ముంద‌స్తు సన్నాహాలు చేస్తోంది. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్పుడే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపింది. ఎన్నిక‌ల‌కు ఇంకా షెడ్యూల్‌ విడుదల కానే లేదు అప్పుడే తమ పార్టీ అభ్యర్థులను చకచకా ప్రకటించేస్తున్నారు ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇవ్వాల (శుక్రవారం) 30 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కూడా ఆయ‌న రిలీజ్‌ చేశారు.

ఇందులో 2015లో కోట్కపుర, బేహబల్‌ కలన్‌ ఫైరింగ్‌ కేసులను దర్యాప్తు చేపట్టి.. సిట్‌కు నేతృత్వం వహించిన పంజాబ్‌ మాజీ పోలీసు ఆఫీస‌ర్‌ కున్వార్‌ విజయ్ ప్రతాప్‌ సింగ్‌ కూడా ఉన్నారు. ఏప్రిల్‌లో వ‌లంటరీ రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ప్రతాప్‌.. అనంతరం ఆప్‌లో చేరారు. ఇప్పటికే 10 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆప్‌ ప్రకటించగా.. వీరంతా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే. ప్రతాప్‌ సింగ్‌కు అమృత్‌సర్‌ ఉత్తర నియోజకవర్గం టికెట్‌ను కేటాయించింది పంజాజ్ ఆప్ పార్టీ.

అదేవిధంగా పంజాబీ సింగర్‌ అన్మోల్‌ గగన్‌ మన్‌ ఖరర్‌, బల్కర్‌ సింగ్‌ సిద్దు రామ్‌పుర ఫుల్‌ నుండి పోటీ చేస్తున్నారు. గత నెలలో కాంగ్రెస్‌ గూటి నుండి ఆప్‌లోకి చేరిన రామ్‌ భల్‌కు గూర్దాస్‌పూర్‌ టికెట్‌ కేటాయించింది. పంజాబ్‌ మాజీ మంత్రి సేవా సింగ్‌ సెఖ్వాన్‌ కుమారుడు జగ్రూప్‌ సింగ్‌ ఖ్వాదియాన్‌ నుండి బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు పలువురు అభ్యర్థల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement