Thursday, May 2, 2024

తండ్రి సమాధి వద్దే పునీత్ అంత్యక్రియలు

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతితో కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నెలకొంది. శుక్రవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన పునీత్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ నాట విషాదం అలుముకుంది. పునీత్‌ మరణవార్త విని.. ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్‌ కుమార్ అంత్యక్రియలు ఆమె కూతురు వచ్చాకే చేయనున్నారు. అమెరికా నుండి పునీత్ కుమార్తె వందిత తిరిగి వచ్చిన తర్వాత అంతక్రియలు నిర్వహిస్తారు.

పునీత్ దివంగత తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ సమాధి పక్కనే పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియులను నిర్వహించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. పునీత్ పెద్ద కుమార్తె వందిత అమెరికా నుంచి రావాల్సి ఉన్నందున అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశం ఉంది. పునీత్‌ మృతి నేపథ్యంలో కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. పునీత్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమతోపాటు తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలు సైతం విషాదంలో మునిగిపోయాయి.

ఇది కూడా చదవండి: Air India: ఎంపీలు విమాన టికెట్లు కొనాల్సిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement