Monday, April 29, 2024

కేంద్ర‌మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ బ‌ర్త్ డే – విషెష్ తెలిపిన ప్ర‌ధాని మోడీ

నేడు కేంద్ర మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియా పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. మాండ‌వీయ దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. మోడీ ప్రభుత్వంలో ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖలను నిర్వహిస్తున్న మాండవ్య ఈరోజు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. భారతదేశ ఆరోగ్యం, రసాయనాలు .. ఎరువుల రంగాలను పెంపొందించడానికి కేంద్ర మంత్రి కృషి చేశారని ప్రధాని మోడీ ప్రశంసించారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా జీకి జన్మదిన శుభాకాంక్షలు. మన ఆరోగ్యం, రసాయనాలు .. ఎరువుల పరిశ్రమలను మెరుగుపరచడానికి ఆయన కృషి చేస్తున్నారు.

ఆయన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాం అని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మాండవీయ శుభాకాంక్షలు తెలిపినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.. ఆయన నాయకత్వంలో భారతీయ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ, మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీ స్థిరమైన మద్దతు ..మార్గదర్శకత్వం కారణంగా నేను మరింత ఉత్సాహంతో మరియు అంకితభావంతో దేశానికి సేవ చేయడానికి ప్రేరేపించబడ్డాను. మీ నాయకత్వంలో, నాకు అవకాశం లభించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement