Thursday, May 16, 2024

ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో 26.14శాతం వృద్ధి : మంత్రి కేటీఆర్

ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…. తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ, దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, తెలంగాణలో ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ నెల 20న టీ హబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement