Tuesday, May 7, 2024

డేంజ‌ర‌స్ చిత్రం రిలీజ్ వాయిదా – ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ డేంజ‌ర‌స్ చిత్రం రిలీజ్ వాయిదా ప‌డింది. దీనికి గ‌ల కార‌ణాన్ని కూడా వివ‌రిస్తూ కాసేప‌టి క్రితం వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. డేంజ‌ర‌స్ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన వ‌ర్మ‌.. త్వ‌ర‌లోనే చిత్రాన్ని విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది.
స్వ‌లింగ సంప‌ర్కం నేప‌థ్యంలో వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మరికొన్ని థియేట‌ర్లు కూడా ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందుకు రాలేద‌ట‌. ఈ కార‌ణంగానే చిత్ర విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు వర్మ ప్ర‌క‌టించారు. త‌న‌కూ,. త‌న చిత్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పోరాటం చేస్తాన‌ని చెప్పిన వ‌ర్మ‌.. త్వ‌ర‌లోనే చిత్రం విడుద‌ల‌కు మ‌రో తేదీని ప్ర‌క‌టిస్తాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement