Friday, April 26, 2024

అత్యవసర బేస్‌ ఉత్పత్తుల శ్రేణితో ఫేస్‌ బేస్‌ను పరిచయం చేసిన రినీ కాస్మెటిక్స్‌

భారతదేశంలో సుప్రసిద్ధ కాస్మెటిక్‌ బ్రాండ్లలో ఒకటైన రినీ కాస్మెటిక్స్‌ డిజిటల్‌గా తమ మొట్టమొదటి ఎసెన్షియల్‌ బేస్‌ ప్రొడక్ట్స్‌ లైన్‌, ఫేస్‌ బేస్‌ను విడుదల చేసింది. ఈ నూతన ఉత్పత్తుల్లో ఇల్యుమినేటింగ్‌ ప్రైమర్‌, లిక్విడ్‌, స్టిక్‌ ఫౌండేషన్‌, కన్సీలర్‌, కంపాక్ట్‌ లూజ్‌ పౌడర్‌ ఉన్నాయి. స్టిక్‌ ఫౌండేషన్‌, లిక్విడ్‌ ఫౌండేషన్‌, కంపాక్ట్‌, కన్సీలర్‌లు ఐదు షేడ్లు కలిగి ఉండగా, లూజ్‌ పౌడర్‌లో నాలుగు షేడ్లు ఉండి భారతీయ చర్మపు రంగులకు సైతం అనువుగా ఉంటాయి. ఈ ఆవిష్కరణ గురించి రినీ కాస్మెటిక్స్‌ ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆష్కా గొరాడియా మాట్లాడుతూ… త‌మ కాస్మెటిక్‌ ఉత్పత్తుల శ్రేణిలో ఫేస్‌బేస్‌ను పరిచయం చేయడంతో పాటుగా డిజిటల్‌ గా ఆవిష్కరించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. ఇది త‌మ బేస్‌ ఎసెన్షియల్‌ ఉత్పత్తుల శ్రేణిలో మొట్టమొదటి ఉత్పత్తి అన్నారు. తాము విస్తృతశ్రేణిలో పరిశోధించడంతో పాటుగా వినియోగదారులకు అనుకూలంగా మలిచామన్నారు. త‌మ వినియోగదారులు వృద్ధి చెందుతున్న డిమాండ్‌కనుగుణంగా, భారతీయ స్కిన్ టోన్స్‌కు తగిన ఉత్పత్తులను తీర్చిదిద్దాలన్నది త‌మ ప్రయత్నమ‌ని అన్నారు. కాస్మెటిక్స్‌ పరిశ్రమలో బలీయంగా ఉనికిని చాటుతున్న రెనీ కాస్మెటిక్స్‌ కు 300కు పైగా స్టోర్లు ఉన్నాయన్నారు. తమ ఆఫ్‌లైన్‌ స్టోర్ల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement