Wednesday, May 1, 2024

224 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు.. వెహికిల్​ వదిలేసి పారిపోయిన గ్యాంగ్​

పటాన్ చెరు, ప్రభన్యూస్​: నిషేధిత గంజాయినీ గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్రమార్కులు పారిశ్రామిక ప్రాంతాల‌తోపాటు, ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి సప్లై చేస్తున్నారు. దొడ్డిదారిన డబ్బులు దండుకోవచ్చని ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్ని తనిఖీలు చేసిన అక్రమ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రంపచోడవరం నుంచి కర్నాటక రాష్ట్రానికి తరలిస్తున్న గంజాయిని ప‌టాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం డీఎస్పీ భీమ్ రెడ్డి మీడియాకు ముఠా వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త‌మ‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప‌టాన్‌చెరు మండలం రుద్రారం శివారులో వాహన తనిఖీలు చేపట్టాం. ఈ తనిఖీల్లో షిఫ్ట్ డిజైర్ కారులో 224 కేజీల గంజాయిని త‌ర‌లిస్తుంగా పట్టుకునీ స్వాధీనం చేసుకున్నాం. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 44.80 ల‌క్ష‌లు ఉంటుంది అని డీఎస్పీ వివ‌రించారు. కాగా, గంజాయి తరలిస్తున్న నిందితులు పోలీసుల‌ను చూసి కారు వదిలి పరారయ్యారు. ఆ కారును సీజ్ చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement