Saturday, April 27, 2024

PM MODI: జమ్ముకశ్మీర్​లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జమ్ముకశ్మీర్​లో పర్యటించనున్నారు. జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీ తొలిసారి పర్యటించనున్నారు. దాదాపు రూ.20 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ‘జాతీయ పంచాయతీ రాజ్‌’ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. కశ్మీర్‌ పర్యటనలో రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ రహదారిని ప్రధాని ప్రారంభించనున్నారు. రూ.7,500 కోట్లతో నిర్మించనున్న ఢిల్లీ-అమృతసర్‌-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారితో పాటు చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులనూ ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, శుక్రవారం సుంజ్వాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే-మహమ్మద్‌ తీవ్రవాదుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధాని భద్రతను అధికారులు మరింత పటిష్ఠం చేశారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement