Sunday, April 28, 2024

పంజాబ్ లో ప్ర‌ధాని మోడీకి నిర‌స‌న సెగ – వివ‌ర‌ణ కోరిన‌ హోం మంత్రిత్వ శాఖ

పంజాబ్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి నిర‌స‌న సెగ త‌గిలింది. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కాన్వాయ్ ని అడ్డుకున్నారు ఆందోళ‌న‌కారులు. దాంతో ప్ర‌ధాని కాన్వాయ్ 20నిమిషాలు ఆగిపోయింది. దాంతో వెనుదిరిగి ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు న‌రేంద్ర మోడీ. దాంతో ఫిరోజ్ పూర్ లో ప్ర‌ధాని మోడీ స‌భ ర‌ద్ద‌యింది. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ సీరియ‌స్ అయింది. భ‌ద్ర‌తాలోపంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దాంతో పంజాబ్ సీఎం చ‌న్నీ స్పందించారు. పీఎం భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో లోపం లేద‌న్నారు. హుస్పేనివాలాలోని జాతీయ అమర‌వీరుల స్మార‌క‌స్థూపాన్ని సంద‌ర్శించేందుకు బ‌టిండాలో దిగారు మోడీ. హెలికాప్ట‌ర్ ద్వారా వేదిక వ‌ద్ద‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ వ‌ర్షం , వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌డంతో 20నిమిషాలు వేచి చూడాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి.

దాంతో రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు.. దీనికి రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. డిజిపి పంజాబ్ పోలీసులు అవసరమైన భద్రతా ఏర్పాట్లను ధృవీకరించిన తర్వాత మోడీ రోడ్డు మార్గంలో ప‌య‌నించిన‌ట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. స్మారక చిహ్నం నుండి 30 కి.మీ దూరంలో ఉండ‌గా , ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నప్పుడు, నిరసనకారులు రహదారిని చుట్టుముట్టారు. నేడు పంజాబ్‌లో రూ. 42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా పంజాబ్‌లో పర్యటించనున్నారు. కాగా నేడు ఉత్తరాఖండ్‌లో 23 ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై ఇరుక్కుపోయారు. ఇది ప్రధానమంత్రి భద్రతలో పెద్ద లోపం” అని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం నుండి హోం మంత్రిత్వ శాఖ వివరణాత్మక నివేదికను కోరింది, బాధ్యతను నిర్ణయించి చర్యలు తీసుకోవాలని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement