Tuesday, May 7, 2024

వైర‌ల్ గా ఫొటో..ఫాలో అవ్వ‌మంటోన్న పోలీసులు..

ఇండియాలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి. రోడ్లు బాగోకో..మ‌రేద‌యినా కార‌ణం కావొచ్చు. మ‌రి జ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి క‌దా..అందుకే పోలీసులు ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు ఎన్నో జాగ్ర‌త్త‌లు చెబుతుంటారు..హెల్మెట్ ఒక‌రికే కాదు వెనుక కూర్చున్న వారికి అవ‌స‌రమే అంటున్నారు. ఒక‌రు పెట్టుకోవ‌డ‌మే ఎక్కువ అనేలా బిహేవ్ చేస్తుంటారు చాలా మంది. కానీ ఇప్పుడో ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అది చిన్న మోపెడ్ బండి..దానిపై ఇద్ద‌రు ఉండ‌గా వారిద్ద‌రూ హెల్మెట్ ధ‌రించ‌డం విశేషం. బండి చిన్న‌దే..ప్రాణం పెద్ద‌ది క‌దా అనే తీరుగా అనిపిస్తోంది..ఈ ఫొటో హైద‌రాబాద్ మూసాపేట్ మెట్రో స్టేష‌న్ ద‌గ్గ‌ర తీశారు. ఈ మేర‌కు పెద్ద, పెద్ద స్పోర్ట్స్ బైక్స్ నడుపుతూ కూడా మినిమం సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదు. ఈ ఫోటోలోని వ్యక్తి మోపెడ్ నడుపుతూ కూడా తనతో పాటు పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించేలా జాగ్రత్త తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement