Thursday, May 2, 2024

Petrol, Diesel Prices: వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 115 రూపాయాలు దాటింది. గత ఏడు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. బధవారం మాత్రం స్థిరంగా కొనసాగాయి. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.114.49గా ఉండగా.. లీటరు డీజిల్ ధర రూ.107.40కి చేరింది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.116.61కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.108.89గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.110.04గా ఉంది. డీజిల్ రూ.98.42 వద్ద కొనసాగుతోంది. ఇక, ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.115.85 ఉండగా.. డీజిల్ ధర రూ.106.62గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement