Friday, May 17, 2024

TS: ఎంసెట్‌ తుది‌వి‌డత కౌన్సె‌లింగ్‌.. 25న స్పాట్‌ అడ్మి‌షన్లు

ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం ఎంసెట్‌ తుది ‌వి‌డ‌త‌ కౌన్సెలింగ్ ఈ నెల 6న నిర్వహించనున్నారు. ఇప్ప‌టికే తొలి‌వి‌డత కౌన్సె‌లింగ్‌ పూర్తి‌కాగా.. మిగి‌లిన సీట్లను ఈ రెండో‌వి‌డతలో భర్తీ చేయ‌ను‌న్నారు. ఈ నెల 6 నుంచి కౌన్సె‌లింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 20 నుంచి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సె‌లింగ్‌ మొద‌లు‌వుతుంది. ఎంసెట్‌ తొలి‌వి‌డత సీట్ల రద్దు గడు‌వును ఈ నెల ఐదో‌తేదీ వరకు పొడి‌గిం‌చారు. ఇంజి‌నీ‌రింగ్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 25న స్పాట్‌ అడ్మి‌షన్లు నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. మూడు‌ వి‌డ‌తల్లో భర్తీ‌కాని సీట్లను స్పాట్‌ ద్వారా యాజ‌మా‌న్యాలే భర్తీ చేసు‌కొనే అవ‌కాశం కల్పిం‌చారు. 

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement