Wednesday, May 15, 2024

పేదొళ్లకు పువ్వాడ.. పేదల ఆత్మ బంధువు అజయ్

ఒక ఆశ జీవితాన్ని నిలబెడుతుంది. ఒక ఆసరా బతుకుకు చేయూతనిస్తుంది. ఒక అండ కుటుంబాన్ని నిలబెడుతుంది. ఒక తోడు కష్టంతో కలబడే శక్తినిస్తుంది. ఒక ఆశ్వాసన ఊరికి ఊపిరి పోస్తుంది. ఒక ప్రయత్నం జాతి ప్రస్థానాన్నే మారుస్తుంది. సరిగ్గా ఇవే అక్షరవెన్నెల సాక్షిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేదల సంక్షేమం కోసం, వారి  జీవనవ్యవన రూపురేఖలు మార్చే సంకల్పాన్ని భుజాలకు ఎత్తుకుని ముందుకు సాగుతూ ఆ విధంగానే మంత్రి అజయ్ కృషి ఫలితం ఆవిష్కృతం అవుతున్నది. ఖమ్మం పేదలకు ఆత్మ బంధువుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరుగాంచారు.

కష్టకాలంలో కనికరించేవారు లేక కష్టపడ్డ వృద్ధులను, అర్ధాకలితో పస్తులున్న పేదలను, వితంతువులను అనేక వర్గాల ఆర్తులను ఆప్యాయతతో ఆదుకున్న చరిత్ర పువ్వాడ కుటుంబంది. ఇప్పుడు మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. నాడు పువ్వాడ నాగేశ్వరరావు, ఉదయ్ కుమార్ నుంచి నేటి అజయ్ కుమార్ వరకు పేదల పక్షాన నిలిచే గుణం వారిది. నాడు అధికారం లేకున్న పేదలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన సందర్బాలు ఎన్నో.. నేడు అధికారపక్షంలో ఉన్న మంత్రి అజయ్ కుమార్ సరికొత్త ఒరవడి తో పేదల బతుకు చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేపట్టి సఫిలికృతమయ్యారు. ప్రజల నిర్దిష్ట సామాజిక స్థితిగతులపై సంపూర్ణ అవగాహనతో అభివృద్ధి వికాసాలకు మార్గాలు రూపొందించారు. సహజ వనరులైన నదీనదాలు, ఖనిజ సంపదను జాతిజనుల ప్రయోజనాల కోసం వినియోగించుకొనే నేర్పు కలిగివున్నారు. భవిష్యత్‌ దర్శనంతో, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగారు దానికి అసాధారణ కృషి, పట్టుదల, సామాజిక దృక్పథం వారికి ఉన్నది. సువిశాల ప్రాంతంలో జీవనదులెన్ని ఉన్నా, విస్తారమైన ఖనిజ సంపద ఉన్నా వాటిని ప్రజోపయోగంలోకి తీసుకువస్తేనే అభివృద్ధి సాధ్యమని నిరూపించారు.

ప్రతి ఒక్కరినీ ఇంటి మనిషిలా చేసుకునేంతటి సుగు ణ సంస్కారం, విధి నిర్వహణలో, ప్రజాసేవలో, ఆపన్నులను ఆదుకోవటంలో విసుగూ, విరామం ఎరుగని నిరంతర కృషీవలుడు. ఎంతటి వివాదాస్పద విషయమైనా, రాజకీయ వైరుధ్యాలనైనా తనదైన శైలిలో పదునైన చెణుకులకే పరిమితం చేసే హుందాతనం ఆయన సొంతం. ఎంత క్లిష్టమైన బాధ్యతనైనా తిరుగులేని ఆత్మవిశ్వాసం, మొక్కవోని దీక్షతో అలవోకగా అధిగమించే సాఫల్య చిరునామా అతడు. అందుకే ప్రజా జీవితంలో దేశమే కాదు, ప్రపంచం మెచ్చిన ప్రజానేతగా మంత్రి అజయ్ భాసిల్లుతున్నారు.

పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనేవి ప్రాథమిక అవసరాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తించి, నాగరికత అభివృద్ధి చెందిన నేటి కాలంలో అవి ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనాలు అని ఏదో ఒకటి అనే స్థాయినుంచి తాము కోరుకున్నదే ఎంచుకునే స్థాయికి సమాజంను చేర్చాలని పూనుకున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు నివాసం అంటే చాలీ చాలని ఇరుకుగది కాదని భావించి కనీసం రెండు తరాలకు ఉపయోగపడే విధంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి ఉచితంగా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు ఖమ్మం  నగరంలోని 1008 మంది నిరుపేదలకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్, టేకులపల్లిలోని కేసిఆర్ టవర్స్ లో ఒకే చోట డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇప్పటికే లబ్ధిదారులకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ చేతులమీదుగా అందజేయగా మరో 240 ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా అతి త్వరలోనే పేదలకు పంపిణీ చేయనున్నారు. 

నాడు ఎన్నికల సమయంలో ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వాగ్ధానం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ వలె ఒకే చోట ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించటం మొదటి ప్రాంతం ఇది. మంత్రి అజయ్ కుమార్ పర్యవేక్షణలో నిర్మించిన ఈ ఇండ్లు నిరుపేదలకు నివాసయోగ్యంగా, వారి ఆత్మ గౌరవం కాపాడేలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు (560 చదరపు అడుగులు) నిర్మించి ఇస్తున్నది. ఈ డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు, ఇండ్లలో రెండు పడక గదులతోపాటు, హాలు, వంటగది, 2 టాయిలెట్లు ఉంటాయి. ప్రత్యేక కాలనీల్లో కొత్తఇండ్లను నిర్మిస్తున్నారు. మోడల్‌ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకిరువైపులా చెట్లు, ప్రతీ ఇంటిముందూ మొక్కలు నాటుతున్నారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతున్నా ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రతీఇంటికి వేర్వురుగా మెట్లు, వాటర్‌ట్యాంక్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. ఈవిధంగా పేదలను కార్పొరేట్ స్థాయి జీవనం సాగించేలా కృషి చేశారు. ప్రతి పేదవానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి అందజేసే ప్రయత్నం చేస్తూనే ఖాళీ జాగా ఉన్న స్థలాలను పేదలకు కేటాయించి వారికి పట్టాలు పంపిణీ చేస్తున్నారు. గతంలో ఖమ్మం నగర ప్రజలకు సీఎం కేసిఆర్ హామీ మేరకు పేద ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొందరికి ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేయగా ఆదివారం మరికొందరికి పట్టాలు అందజేసి వారిలోని చిరు మందహాసానికి నిలువెత్తు రూపమయ్యి పేదొళ్లకు పువ్వాడ అనే రీతిలో ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement