Saturday, April 27, 2024

గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌మెంట్..ప‌తాక‌స్థాయికి విభేదాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఇదివరకు ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో తాజా రాజకీయ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. కేసీఆర్‌ ప్రభుత్వానికీ, గవర్నర్‌ వ్యవస్థకు అంతర్గత యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. దాదాపు ఏడాది కాలం క్రితం ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య తలెత్తిన విభేదాలు ఇటీ-వల మరింతగా ముదిరాయి. పెండింగ్‌ బిల్లుల సంఖ్య 7 నుంచి 10కి చేరుకోవడంతో ఇది ఢిల్లీ స్థాయికి చేరుకుంది. సమస్యను తేల్చాలంటూ దేశ అత్యున్నత స్థాయికి వద్దకు ఫిర్యాదులు అందాయి. ఇక చేసేదేమీ లేక తెలంగాణ సర్కారు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో ఈ వ్యవహారంపై కొంతమంది రాజకీయ ప్రముఖులు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసినట్లు- సమాచారం. గవర్నర్‌ వర్సెస్‌ గవర్న మెంట్‌ అనే అంశంపై చర్చ ఇటు గ్రామస్థాయి వరకు చేరుకుంది. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య రాజ్యాంగంలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద పదవిలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునే అధికారాలు రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్‌కు ఉన్నాయా..? అన్న కోణంలో చర్చ జోరందుకుంది.
గల్లీ టు- ఢిల్లీ… నివురుగప్పిన నిప్పులా ఎటుచూసినా అదే చర్చ జరుగుతోంది. అదే సమయంలో పెండింగ్‌ బిల్లుల వ్యవహారంపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలో ఇక.. ప్రజలే న్యాయ నిర్ణేతలు అన్న నినాదం బలపడుతోంది. నిత్యం గవర్నర్‌ వ్యవహార ంపై మంత్రులు మాటలతో విరుచుకుపడుతున్నారు. అధికార యంత్రాంగమూ రాజకీయ కోణంలోనే పనిచేస్తోందని తాజాగా గవర్నర్‌ ఆరోపించారు. ఈ క్రమంలో విభేదాలు హద్దుమీరి పతాక స్థాయికి చేరితే, ప్రజా ఉద్యమం తప్పదన్న భావన ప్రజల్లో బలపడుతోంది. తప్పెవరిది?.. అంటూ ఇటు- గ్రామస్థాయిలో సాధారణ ప్రజానీకం వరకు చర్చ జరుగుతోంది. ముదురుతున్న వ్యవహారంపై ప్రజలు స్పందిస్తున్న సందర్భాలు బయటకు వస్తున్నాయి. చదువుకున్న ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన అధికా రాలపై ఆరా తీయడంలో ఆసక్తి చూపుతున్నారు. అతిపెద్ద ప్రజా స్వామ్య వ్యవస్థలో అధికా రాలు, బాధ్యతలపై మేధోమ థనం కొనసాగుతోంది. ఈ వ్యవహారాన్ని తీవ్రం గా పరిగణిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తదనంతర చర్యలకు సిద్ధమవుతున్నట్లు- తెలుస్తోంది. రాజ్యాంగ సంక్షోభం దిశగా దారి తీస్తున్న తెలంగాణ వ్యవ హారంపై యావత్‌ దేశం ఆసక్తితో చూస్తోంది.

తెలంగాణలో గవర్నర్‌కు, గవ ర్నమెంట్‌కు మధ్య కొంతకాలంగా గ్యాప్‌ తగ్గినట్లే అనిపించినా అది నివురు గప్పిన నిప్పు అన్న విషయం తాజాగా బయట పడింది. ఆరు నెలలుగా పది బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలుపడం లేదు. అదే సమయంలో తిప్పి పంపడం లేదు. ఆ బిల్లు లను తనవద్ద పెండింగ్‌లో పెట్టు-కున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలుపుతారో లేదో అన్న అనుమానం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం జనవరి 27న గవర్నమెంట్‌ హైకోర్టు తలుపు తట్టింది. గవర్నర్‌ తమిళిసై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు… ప్రభుత్వం రాజ్యాం గం ప్రకారం వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించింది. దీంతో వ్యవహారం బెడిసికొట్టేలా ఉందని భావించిన ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి పిటిషన్‌ ఉపసంహరించుకుంది.

అసెంబ్లీ ముగిసిన తర్వాత మరింత ముదిరిన విభేదాలు
ఇటీ-వల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. గందరగోళ పరిస్థితుల మధ్య గవర్నర్‌ ప్రసంగంతోనే ఈ సమావే శాలు మొదలయ్యాయి. అంతర్గత విభేదాలు ఉన్నా.. అంతా ఆశ్చర్యపడేలా సీఎం కేసీఆర్‌ స్వయంగా గవర్నర్‌ను అసెంబ్లీకి తీసుకొచ్చారు. గవర్నర్‌ కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే యథావిధిగా చదివారు. దీంతో ఇక రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య వివాదం సమసిపోయినట్లే అని అంతా భావించారు. కానీ, తాజాగా కేసీఆర్‌ సర్కార్‌ పెండింగ్‌ బిల్లులు ఆమోదం కోసం సుప్రీం కోర్టులో చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారితో పిటిషన్‌ వేయించింది. పది బిల్లులను ఆరు నెలలుగా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గవర్నర్‌ ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలని కానీ, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు హోలీ సెలవుల తర్వాత విచారణ జరుపుతామని ప్రకటించింది.

అధికారిక సైట్‌లో కనిపించని 150 జీవోలపై సర్వత్రా విమర్శలు
ఫైళ్ల పెండింగ్‌ అటు-ంచితే వివిధ అంశాలపై ప్రభుత్వం జారీ చేసే జీవోలను కూడా ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచు తోంది. గడిచిన 9 ఏళ్లలో 150 జీవోలను రహస్యంగా ఉంచింది. ప్ర భుత్వం ఏ జీవో జారీ చేసినా దానిని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటు-లో ఉంచాలి. గత ప్రభుత్వాలు ఈ సంప్రదాయం పాటించాయి. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక… సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు నచ్చే జీవోలను మాత్రమే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు. తన ప్రయోజనాల కోసం, ప్రజాప్రతినిధుల ప్రయోజ నాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం జారీ చేసే జీవోలను మాత్రం రహస్యంగా ఉంచింది. ఈ విషయం ఇటీ-వల బయటకు వచ్చినా.. దీనిపై కూడా కేసీఆర్‌ నుంచి స్పందన లేదు. గవర్నర్‌ తప్పు చేస్తు న్నారని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని, స్వతంత్రగా వ్యవహరిస్తు న్నారని, ప్రభుత్వ సూచన మేరకు పని చేయడం లేదని ఆరోపిస్తున్న సర్కార్‌ మరి తాను 11 వేల ఫైళ్లు పెండింగ్‌లో పెట్టినందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్య త కూడా ఉంది. 10 బిల్లులకు గవర్నర్‌ను తప్పుపడుతున్న కేసీఆర్‌ సర్కార్‌ను 11 వేళ ఫైళ్లు పెండింగ్‌లో పెట్టినందుకు ఎన్నిసార్లు తప్పు పట్టాలి, కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement