Wednesday, May 1, 2024

Asia Cup | పాక్​, శ్రీలంక ఆటకు వర్షం అడ్డంకి,42 ఓవర్లకు కుదింపు.. శ్రీలంక టార్గెట్​ ఎంతంటే!

ఆసియాకప్​లో భాగంగా ఇవ్వాల (గురువారం) శ్రీలంక, పాక్​ మ్యాచ్​పై ఆసక్తిపెరిగింది. ఈ మ్యాచ్​లో తొలుత టాస్​ గెలిచిన పాక్​ బ్యాటింగ్​ తీసుకుంది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్​ని వరుణుడు ఆదుకున్నాడు. మ్యాచ్​ మధ్యలో భారీ వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. కాగా, అబ్దుల్లా శఫీక్​ (52), మహ్మద్​ రిజ్వాన్​ 86 పరుగులతో జట్టును ఆదుకున్నారు. వర్షం రావడంతో ఆటను 42 ఓవర్లకే పరిమితం చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లలో పాక్​ ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఇక.. 263 పరుగుల టార్గెట్​తో మరికొద్దిసేపట్లో శ్రీలంక చేజింగ్​కు దిగనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement