Thursday, May 16, 2024

OnePlus 9 Pro, 9లో OxygenOS 12 అప్‌డేట్‌.. బ‌గ్స్ ఉన్నాయ‌ని కంప్లెయింట్స్‌..

వ‌న్‌ప్ల‌స్ ఆక్సిజ‌న్ ఓఎస్ 12 అప్‌డేట్‌లో రీవర్క్ చేసిన ఐకాన్‌లు, డార్క్ మోడ్‌తో సహా అనేక కొత్త ఫీచర్‌లు ఉన్న‌ప్ప‌టికీ ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న‌ట్టు యూజ‌ర్లు చెబుతున్నారు. ఈ మ‌ధ్య‌నే వ‌న్ ప్ల‌స్ మోడ‌ల్స్ 9ప్రొ, 9 సిరీస్‌ల‌కు వ‌ర్ష‌న్ అప్‌డెట్ అయ్యింది. దీంతో ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నామ‌ని య‌జ‌ర్లు కంప్లెయింట్ చేస్తున్నారు. అంతేకాకుండా పూర్‌ యానిమేషన్‌, ఆటోఫిల్ ఫీచర్ తో స‌హా Wi-Fi కూడా స్పీడ్ త‌గ్గింద‌ని చెబుతున్నారు. ఆక్సిజన్ ఓఎస్ అప్‌డేట్‌లో కస్టమైజేషన్ కు సంబంధించిన ఫీచర్‌లు కూడా లేవని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో ఇటీవలే ఆక్సిజన్‌ఓఎస్ 12తో ఆండ్రాయిడ్ 12కి అప్‌డేట్ అయ్యాయి. Google ద్వారా పిక్సెల్ సిరీస్ ఫొన్ల‌లో ఆండ్రాయిడ్ 12 రిలీజ్ అయిన త‌ర్వాత ఇప్పుడు అన్ని ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు ఈ అప్‌డేట్‌ని అందిస్తోంది. అయితే, అప్‌డేట్ చేసిన‌ OxygenOS 12తో అంతా సజావుగా సాగుతున్నట్లు కనిపించడం లేదు. ఇది బగ్‌లతో నిండిపోయిందని వినియోగదారులు నివేదిస్తున్నారు. అంతే కాదు, కొత్త వెర్షన్ కొన్ని ఫంక్షన్‌లను కూడా తీసివేసినట్లు కనిపిస్తోంది, వినియోగదారులు చాలా సంవత్సరాలుగా అలవాటు పడిన ఫీచ‌ర్స్ కొన్ని లేక‌పోవ‌డంతో అసౌక‌ర్యంగా ఫీల్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

వ‌న్ ప్ల‌స్ UI ఇన్ కాన్‌సిస్టెన్స్‌, యానిమేషన్ ప‌నితీరు బాగా లేక‌పోవ‌డం వంటి లోపాలున్నాయి. అంతేకాకుండా Wi-Fi స్పీడ్ కూడా త‌గ్గ‌డం అంద‌రినీ ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. దీంతోపాటు కాల్ చేసిన‌ప్పుడు, రిసీవ్ చేసుకున్న‌ప్పుడు ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. ఇట్లాంటి అనేక సమస్యలున్నాయ‌ని యూజ‌ర్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement