Sunday, May 5, 2024

ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన 100మహిళ‌ల జాబితాలో నిర్మ‌లా సీతారామన్ .. ముచ్చ‌ట‌గా మూడోసారి ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఫోర్బ్స్ జాబితాలో ముచ్చ‌ట‌గా మూడోసారి చోటుని ద‌క్కించుకున్నారు. 2021లో ఆమె ర్యాంకింగ్ 37కి పెర‌గ‌డం విశేషం. నిర్మ‌లా సీతారామ‌న్ అమెరిక‌న్ కౌంట‌ర్ జానెట్ యెల్లెన్ కంటే రెండు స్థానాలు ముందున్నారు. ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన వంద మంది మ‌హిళ‌ల జాబితాను ఫోర్బ్స్ ప్ర‌క‌టించింది. కాగా సంవ‌త్స‌రం క్రితం నిర్మలా సీతారామన్‌ 41 స్థానంలో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్‌ రెండో స్థానంలో నిలిచారు.అత్యంత శక్తివంతమైన మహిళల మొదటి స్థానంలో మెకెంజీ స్కాట్ (యూఎస్‌) ఒకటో స్థానంలో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement