Thursday, April 25, 2024

‘RRR’ భీమ్ గ్లింప్స్..

సినీ ప్రేక్షకులు ఎంతో ఆస్తకిగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చారణ్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్ తో బిజీ అయింది. డిసెంబరు 9న ‘ఆర్​ఆర్​ఆర్’​ ట్రైలర్​ విడుదల చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేస్తూ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ చేస్తున్నారు. మంగళవారం అల్లురి సీతారామరాజు​( రామ్​చరణ్​ పాత్ర) సంబంధించిన గ్లింప్స్​ను ఎన్టీఆర్​ విడుదల చేయగా.. బుధవారం కొమురం భీమ్(తారక్​కు​) సంబంధించిన గ్లింప్స్​ను రామ్ చరణ్ రిలీజ్​ చేశారు​. ఈ రెండు ట్రైలర్​పై అంచనాలను పెంచుతున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీలో అజయ్​దేవగణ్​, శ్రియ, ఆలియాభట్​ కీలక పాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement