Saturday, May 4, 2024

18ఏళ్ల లోపు పిల్ల‌ల‌పై ఒమిక్రాన్ పంజా – మూడు రాష్ట్రాల వారికి హెచ్చ‌రిక‌లు

ప్ర‌పంచ‌దేశాల‌న్నింటిని అత‌లాకుత‌లం చేస్తుంది ఒమిక్రాన్. కాగా ఒమిక్రాన్ పిల్ల‌లు,18సంవ‌త్స‌రాలలోపు వారిపై అధికంగా ప్ర‌భావం చూపుతుంద‌ట‌. ప్ర‌పంచారోగ్య‌సంస్థ సైతం పిల్ల‌ల‌పై క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ప్ర‌భావం అధికంగా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంచ‌నా వేసింది. దీనికి అనుగుణంగానే ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతున్నాయి. పిల్లలు, 18 సంవత్సరాల లోపు యుక్త వయస్కులకు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా సోకుతుందంటూ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఇదివరకే హెచ్చరించారు. మ‌న దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ‌గా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్రత్యేకించి- మూడు రాష్ట్రాల్లో పిల్లల్లో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, గుజరాత్, కర్నాట‌క‌ల్లో పిల్లలు దీని బారిన పడ్డారు. మొత్తంగా తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక మహారాష్ట్రలో కొత్తగా 23 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో నలుగురు 18 సంవత్సరాల్లోపు వారు ఉన్నారు. గుజరాత్‌లో ఏడు కొత్త ఒమిక్రాన్ కేసుల్లో మూడు, క‌ర్నాట‌క‌లో 13కు రెండు ఒమిక్రాన్ కేసులు 18 సంవ‌త్స‌రాల లోపు వారు ఉన్నారు. అలాగే, క‌ర్నాట‌క‌లో గ‌త 24 గంటల వ్యవధిలో కొత్తగా 13 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, అందులో తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరు విదేశాల నుంచి వ‌చ్చిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. అన్ని కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించినప్పటికీ.. వైరస్ సోకిందట‌. అయితే, కొత్త‌గా న‌మోద‌వుతున్న‌కేసుల‌క‌లో 18 సంవ‌త్స‌రాల లోపువారు అధికంగా ఉండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే ఈ వ‌య‌స్సు గ్రూప్ లోని వారికి క‌రోనా టీకాలు ఇంకా మ‌న దేశంలో అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ వేరియంట్ పంజా విసిరే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు తెలిపారు. జ‌నం ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో ఉండొద్ద‌ని, మాస్క్ లు త‌ప్ప‌కుండా ధ‌రించాల‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement