Monday, May 6, 2024

గోపీచంద్ 30వ చిత్రం – క్లాప్ కొట్టిన వి.వి.వినాయ‌క్

ద‌ర్శ‌కుడు శ్రీవాస్ తో మూడోసారి వ‌ర్క్ చేస్తున్నాడు హీరో గోపీచంద్. ఇప్ప‌టికే ల‌క్ష్యం, లౌక్యం చిత్రాల‌ను తెర‌కెక్కించాడు శ్రీవాస్. కాగా గోపీచంద్ 30వ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నాడు. హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. కాగా బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ కెమెరా స్విచ్ ని ఆన్ చేశారు. గోపీచంద్ పై తొలి షాట్ కు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలకపాత్రకు రాజశేఖర్ ను తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. మిగ‌తా న‌టీన‌టుల గురించి త‌ర్వ‌లో వెల్ల‌డించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement