Saturday, April 27, 2024

Omicron Effect: విదేశీ ప్రయాణికులకు కొత్త రూల్స్.. క్వారంటైన్‌ కంపల్సరీ

వరల్డ్ వైడ్ గా కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంటూ.. హెల్త్ డిపార్డ్ మెంట్ ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తోంది. మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా ఇప్పడు మళ్లీ పంజా విసురుతోంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియెంట్ భయాందోళనలకు గురిచేస్తోంది. ఒమిక్రాన్‌ కారణంగా దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గురువారం ఇటలీ నుంచి పంజాబ్‌ వచ్చిన ఓ చార్టర్డ్‌ విమానంలో ని ప్రయాణికులకు జరిపిన పరీక్షల్లో 125 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ని తెరమీదికి తీసుకొచ్చింది. విదేశాల నుంచి భారత్‌ వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను శుక్రవారం సవరించింది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ముప్పు ఎక్కువ ఉన్న దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. క్వారంటైన్‌ ముగిసిన తర్వాతి రోజు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. ప్రయాణానికి ముందు ప్రయాణికులు తప్పనిసరిగా 72 గంటల లోపు చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల నెగటివ్ రిపోర్ట్ సమర్పించాలి. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement